290కి చేరిన మృతుల సంఖ్య‌..క‌ర్ఫ్యూ ఎత్తివేత‌

Mon,April 22, 2019 09:49 AM

death toll from terror attack rises to 290

కొలంబో: శ్రీలంక‌లో జ‌రిగిన వ‌రుస బాంబు పేలుళ్ల మారణహోమంలో ఇప్పటివరకు 290 మంది మృతిచెందగా, 500 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డార‌ని శ్రీలంక పోలీస్ అధికార ప్ర‌తినిధి రువాన్ గుణ‌శేఖ‌ర సోమ‌వారం తెలిపారు. ఈ పేలుళ్ల‌తో సంబంధాలున్న‌ట్లు అనుమానిస్తున్న 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశార‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం వారిని ఉన్న‌తాధికారులు విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వివ‌రాలు తెలియ‌జేసేందుకు ఆయ‌న నిరాక‌రించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నట్టు తెలుస్తున్నది. మ‌రోవైపు ఆదివారం చోటుచేసుకున్న వ‌రుస పేలుళ్ల ఘ‌ట‌న‌లో దేశ‌వ్యాప్తంగా క‌ర్ఫ్యూ విధించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఇవాళ ఉద‌యం 6 గంట‌ల‌కు ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూను ఎత్తివేసింది. నిన్న కొలంబో సహా మూడు నగరాల్లో ఎనిమిది బాంబు పేలుళ్లు జ‌రిగాయి. క్రైస్తవులు, టూరిస్టులు లక్ష్యంగా చర్చిలు, ఫైవ్‌స్టార్ హోటళ్లపై దాడి ఉగ్ర‌వాదులు దాడికి పాల్ప‌డ్డారు.

1200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles