ఫారెస్ట్ రిజర్వుల్లో జంతువులు కొట్లాడుకునే వీడియోలు తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఇలాంటిదే ఓ యుద్దం జరిగింది. కెన్యాలోని మసాయి మరా ట్రయాంగిల్ రిజర్వులో చిరుత, ఫైతాన్ ఒకదానిపై మరొకటి తమ సత్తా చూపించేందుకు ప్రయత్నించాయి. చిరుత, కొండచిలువకు మధ్య జరిగిన పోరులో చివరకు చిరుతే గెలిచింది. చిరుత, కొండచిలువ ఒకదానికొకటి చాలా సేపు పోరాడాయి. చిరుత చివరగా కొండచిలువ తలపై కొరకడంతో..అది కుప్పకూలిపోయింది. పైతాన్, చిరుత ఫైటింగ్ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. మైక్ విల్టన్ అనే పర్యాటకుడు ఈ వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు.