పది మంది కుమారుల తర్వాత కూతురు పుట్టింది..

Mon,September 9, 2019 06:25 PM

Daughter is born after ten sons ..

బ్రిటన్: బ్రిటన్‌కు చెందిన అలెక్స్ బ్రెట్, డేవిడ్ బ్రెట్ దంపతులకు ఆడబిడ్డ అంటే ఎనలేని ప్రేమ. కానీ, వారికి పుట్టిన ప్రతి సంతానం మగ బిడ్డే. కూతురు పుడుతుందేమోనని ఆశతో పిల్లలను కంటూనే ఉంటున్నారు. ఇలా వరుసగా పది మంది బాలురకు ఆ దంపతులు జన్మనిచ్చారు. ఇక సంతానానికి స్వస్థి చెబుదామనుకున్న వారు ఈ ఒక్కసారి చూద్దామనుకున్నారు. కానీ, చివరి ప్రయత్నంలో వారి ఆశ నెరవేరింది. అలెక్స్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను వారు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

డేవిడ్ మాట్లాడుతూ.. నేను పోయినసారే సంతానాన్ని ఆపేద్దామని నాభార్యతో అన్నాను. తను మాత్రం ఈ ఒక్కసారి కూతురి కోసం ప్రయత్నిద్దామంది. నేను కాదనలేకపోయాను. ఇపుడు కూతురు పుట్టే సరికి మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు. తనకు కామెరాన్ అని పేరు పెట్టాం. కామెరాన్‌ను ఆమె సోదరులు అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. వారిని చూస్తే ముచ్చటేస్తుందని ఈ సందర్భంగా డేవిడ్ అన్నాడు.

కాగా, వారి సంతానంలో రెండు సంవత్సరాల బాలుడి నుంచి 17 ఏళ్ల యుక్త వయసులో ఉన్న పిల్లలున్నారు.

9253
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles