ఆకాశం సముద్రమైతే ఇలా ఉంటుందే.. ఇలా ఉంటుందే.. వీడియో

Wed,June 19, 2019 08:23 PM

Crazy wave clouds rolled over Lincoln

ఓ.. ఆకాశం అమ్మాయయితే నీలా ఉంటుందే.. నీలా ఉంటుందే.. అంటూ ఓ సినిమాలో హీరోయిన్‌ను ఉద్దేశించి హీరో పాడుతాడు. కానీ.. ఈ వీడియో చేస్తే.. ఆకాశం సముద్రమయితే ఇలా ఉంటుందే.. ఇలా ఉంటుందే అని మీరు పాడుతారు. అవును.. ఆకాశంలో సముద్రపు అలలు విరుచుకుపడ్డట్టుగా ఉంది. కాకపోతే సముద్రం ఆకాశంలోకి వెళ్లలేదు. ఆకాశంలోని మేఘాలే అలా సముద్రపు అలల్లా కదులుతూ సముద్రపు అలల భ్రమను మనకు కల్పించాయి.

ఈ వింత సంఘటన ఆస్ట్రేలియాలోని మైర్టిల్ ఫోర్డ్ లో జరిగింది. ఈనెల 11న పాల్ మెక్ కల్లీ అనే వ్యక్తి ఆకాశం వైపు చూసి వింతగా కదులుతున్న మేఘాలను గమనించాడు. వెంటనే తన మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

ఉరుములు, మెరుపులు ఎక్కువగా వచ్చినప్పుడు ఆకాశంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయని... వీటిని అస్పెరిటాస్ అని కూడా అంటారని.. క్లౌడ్ అప్రిషియేషన్ సొసైటీ తెలిపింది.

5172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles