వివాదమైన చీర కొంగు..

Sat,September 23, 2017 01:17 PM

Couple Used 250 Students To Carry Longest Saree Under Investigation Now

కొలంబో : ఓ వధువు అతి పొడవైన చీర ధరించి తన ముచ్చట తీర్చుకుంది. ముచ్చట తీర్చుకున్న కొద్ది క్షణాల్లోనే ఆ చీర వివాదానికి కారణమైంది. శ్రీలంకలోని క్యాండీ జిల్లాలో ఈ నెల 21న ఓ జంటకు వివాహం జరిగింది. అయితే వధువు 3.2 కిలోమీటర్ల పొడవున్న చీరను ధరించింది. ఆమె చీర కొంగును మోయడానికి 250 మంది విద్యార్థులను, మరో 100 మంది విద్యార్థులను పెళ్లికి వచ్చిన అతిథులకు పుష్పాలను అందించేందుకు ఉపయోగించుకున్నారు. దీంతో బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ.. వధువు కుటుంబ సభ్యులపై శ్రీలంక జాతీయ బాలల సంరక్షణ సంస్థ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపింది. ఈ కేసులో శ్రీలంక చట్టప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే.. స్కూల్ పని వేళల్లోనే విద్యార్థులతో అలా పని చేయించుకోవడం చట్ట విరుద్ధం.

3920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles