యువతికి ప్రపోజ్ చేస్తూ రింగ్ పోగొట్టుకున్నాడు.. వీడియో

Sun,December 2, 2018 01:52 PM

Cops See Man Lose Ring In Front Of Fiancee and helped

దరిద్రమంటే ఇదే కాబోలు. గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేయడమనేది జీవితంలో ఒకేసారి వచ్చే ఘట్టం. ఆ సమయం ఎంతో ఉన్నతంగా ఉండాలనుకుంటారు. కానీ.. ఈ వ్యక్తికి.. గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసే రోజే దరిద్రం చుట్టుకుంది. ఆమెకు రింగ్‌తో ప్రపోజ్ చేస్తుండగా చేతిలో నుంచి రింగ్ జారి కిందనే ఉన్న మ్యాన్‌హోల్‌లో పడింది. దీంతో మనోడు బావురుమన్నాడు. ఈ ఘటన న్యూయార్క్‌లోని టైమ్స్ స్కైర్ బిల్డింగ్ వద్ద చోటు చేసుకున్నది. అయితే.. ఈ ఘటనను గమనించిన పోలీసులు మనోడి ప్రేమను నిలబెట్టడం కోసం మ్యాన్ హోల్‌లోకి దిగి మరీ సెర్చ్ చేశారు. చివరకు రింగ్‌ను కనుక్కున్నారు. కానీ.. ఆ జంట మాత్రం అక్కడ కనిపించలేదు. దీంతో ఆ రింగ్‌ను వాళ్లకు తిరిగి ఇచ్చేయడానికి హెల్ప్ చేయాలంటూ దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దొరికిన రింగ్‌ను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

3922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles