సూపర్‌హీరోలా వచ్చాడు.. మహిళను కాపాడాడు.. వీడియో

Thu,March 15, 2018 03:57 PM

Cop catches woman falling off building in China

ఒక్కోసారి మనుషులే సూపర్‌హీరోల్లా, సూపర్‌మెన్‌లా మారుతుంటారు. దేవుడే మనిషి రూపంలో వచ్చాడంటారు. ఇక్కడ కూడా ఇలాగే జరిగింది. ఓ పోలీస్ ఆఫీసరే దేవుడు, సూపర్ హీరో రూపంలో వచ్చి పైనుంచి దూకిన మహిళను కాపాడాడు. అయితే... ఈ ఘటనలో మహిళకు ఎటువంటి గాయాలు కాకున్నా... పోలీస్ మీద ఆ మహిళ పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. వెన్నముక ప్రాంతంలో చిన్న గాయాలు కాగా.. వెంటనే ఆ పోలీస్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన చైనాలోని అక్సు ప్రిఫెక్షర్‌లో చోటు చేసుకున్నది. తన భర్తతో గొడవ జరగడంతో క్షణికావేశంలో ఆ మహిళ బిల్డింగ్ మీది నుంచి దూకింది. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు మ‌హిళ‌ బిల్డింగ్ మీది నుంచి దూకుతుండగా గమనించారు. ఓ పోలీస్ వెంటనే దూకుతున్న మహిళను తన రెండు చేతులతో పట్టుకున్నాడు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పోలీస్‌ను సూపర్‌హీరోగా కీర్తిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

5665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles