మహిళ చెవిలో దూరిన బొద్దింక.. తొమ్మిది రోజుల తర్వాత బయటికి..!

Sun,May 6, 2018 03:47 PM

Cockroach crawled into woman ear and it took 9 days to get it out

చెవిలోపలికి చిన్న చీమ దూరితేనే అల్లాడిపోతాం. మరి బొద్దింక దూరితే ఇంకేమన్నా ఉందా. అయితే.. నిజంగానే ఓ మహిళ చెవిలోకి బొద్దింక దూరింది. దీంతో ఆ మహిళ తల్లడిల్లిపోయింది. బొద్దింక వల్ల ఆ మహిళ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చివరకు విఫల ప్రయత్నాలు చేసి ఆ బొద్దింకను తొమ్మిది రోజుల తర్వాత వెలికితీయగలిగారు. ఆ బొద్దింక స్టోరీ ఏందో తెలుసుకుందాం పదండి..

అది ఫ్లొరిడాలోని మెల్‌బోర్న్. అక్కడ ఇండ్లలో బొద్దింకలు కామన్. అయితే.. అవి మన దగ్గర ఉండే బొద్దింకల్లా కాదు. అవి ఎగరగలవు. వాటిని పాల్మెట్టో బగ్స్ అని పిలుస్తారు. మెల్‌బోర్న్‌తో పాటు న్యూ ఒర్‌లియాన్స్, హౌస్టన్, అట్లాంటా లాంటి ప్రాంతాల్లోనూ వీటి బెడదే.

ఇక.. మెల్‌బోర్న్‌లో ఉండే కాటి హాలీ అనే మహిళ ఇంట్లోనూ ఇదే బాధ. బొద్దింకలతో వేగలేకపోతున్నది ఆమె. గత సంవత్సరమే వాళ్లు ఆ ఇంట్లోకి మారారు. కొన్ని వారాల క్రితం కాటి అర్ధరాత్రి సడెన్‌గా నిద్ర నుంచి లేచి బాత్రూమ్‌లోకి పరిగెత్తింది. చెవిలో ఏదో తిరుగుతున్నట్లు అనిపించింది తనకు. వెంటనే చెవిలో కొన్ని నీళ్లు పోసి అటూ ఇటూ చెవిని ఊపింది. అయినప్పటికీ.. చెవి నుంచి ఏదీ బయటికి రాలేదు. వెంటనే కాటి భర్త టార్చ్ తీసుకొని బాత్‌రూమ్ వెళ్లాడు. తన చెవిలో టార్చ్ పెట్టి చెక్ చేశాడు. చెవిలో ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది వాళ్లకు. వెంటనే చిమ్మెటతో చెవి లోపల పెట్టి దాన్ని లాగబోయాడు. కాని.. చిన్ని చిన్న కాళ్లు బయటకు వచ్చాయి. అప్పుడు అర్ధమయింది వాళ్లకు లోపల దూరింది బొద్దింక అని. ఆ చిమ్మెట దానికి గుచ్చుకోవడంతో ఆ బొద్దింక ఇంకాస్త లోపలికి వెళ్లిపోయింది.

వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుకెళ్లారు వాళ్లు. వెంటనే లోపల కదులుతున్న ఆ బొద్దింక చనిపోయేలా ఇంజక్షన ఇచ్చారు డాక్టర్లు. అనంతరం దాని బాడీ పార్ట్స్ కొన్ని బయటికి తీసేశాడు. కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వాడమని చెప్పాడు. కాని.. కాటి చెవిలో ఏదోలా ఉంది. దాదాపు తొమ్మిది రోజులు అన్‌ఈజీగా ఫీల్ అయిన కాటి మళ్లీ తన ఫిజిషియన్ దగ్గరకు వెళ్లింది. దీంతో కాటి చెవిని పరీక్షించిన డాక్టర్ మళ్లీ తన చెవిలో నుంచి దాని కాళ్లను బయటికి తీశాడు. అంతే కాదు మిగిలిపోయిన బొద్దింక అవశేషాలకు బయటికి లాగాడు. అయితే.. ఇంకా ఏమైనా దాని అవశేషాలు తన చెవిలో ఉన్నాయేమోనని భయపడిన కాటి.. ఈఎన్‌టీ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లి స్పెషల్ ట్రీట్‌మెంట్ తీసుకున్నాక గాని ఊపిరిపీల్చుకోలేదు. చూశారుగా.. ఓ బొద్దింక ఎంత పని చేసిందో.

5545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles