దేశ‌ అధ్య‌క్షుడి ప్రసంగానికి ఆటంకం క‌లిగించిన‌ బొద్దింక: వీడియో

Fri,May 10, 2019 06:08 PM

Cockroach bugs Philippines President Duterte

ఒక సభలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టో ప్రసంగానికి ఓ బొద్దింక ఆటంకం కలిగింది. అప్రమత్తమైన సిబ్బంది దాన్ని ఆయన టీ షర్ట్ నుంచి కిందపడేశారు. క్యాంపెయిన్ ర్యాలీలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా బొద్దింక ఒక్కసారిగా ఆయన ఎడమ చేతి మీద నుంచి భుజం వరకు పాకింది. వెంటనే ఆయన పక్కనున్న మహిళా సహాయ సిబ్బంది ఒకరు వేగంగా వచ్చి దాన్ని ఒక ఫైల్ సాయంతో దులిపేసింది. ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగానే ఇదంతా జరిగింది. దీనిపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ఈ కాక్రోచ్‌ను ప్రతిపక్ష పార్టీ పంపించిందని వ్యాఖ్యానించడంతో సభలో ఉన్నవారంతా నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

3116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles