షేక్‌హ్యాండ్ ఇవ్వనందుకు పౌరసత్వం తిరస్కరించారు

Sat,August 18, 2018 06:13 PM

citizenship refused for rejecting shakehand

స్విట్జర్లండ్‌లో కరచాలనం చేసేందుకు నిరాకరించినందుకు ఓ ముస్లిం జంటకు పౌరసత్వం నిరాకరించారు. పౌరసత్వం కోసం వారు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలని అధికారులు తీర్మానించారు. స్విస్‌లోని లాసేన్‌లో ఆశ్రయం పొందేందుకు ఓ ముస్లిం జంట ఇటీవల దరఖాస్తు చేసుకున్నది. అయితే వారు స్త్రీ పురుషుల మధ్య షేక్‌హ్యాండ్‌కు వ్యతిరేకత తెలిపారు. అంతేకాకుండా లింగేతరులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఆ దంపతులు ఇబ్బంది పడ్డారు. ఆడ, మగ కలిసి మాట్లాడుకోవడం తమ మతాచారాల ప్రకారం నిషిద్ధమని వారు పేర్కొన్నారు.

దీనిపై లాసేన్ మునిసిపల్ విభాగం వారు డిప్యూటీ మేయర్ అధ్యక్షతన ఓ కమిటీని వేశారు. ఈ తరహా ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, ఇది లింగవివక్ష కిందకు వస్తుందని సదరు కమిటీ అభిప్రాయపడింది. ఆ జంటకు పౌరసత్వం మంజూరు చేయరాదని సిఫారసు చేసింది. దీని ఆధారంగా నగరపాలక సంస్థ వారి పౌరసత్వ దరఖాస్తును తిరస్కరించినట్టు మేయర్ గ్రిగోర్ జునోద్ శుక్రవారం వెల్లడించారు. మతస్వేచ్ఛకు రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ మతం రాజ్యాంగానికి లోబడే ఉండాలని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాజయాంగం అందరూ సమానమే అని చెప్తుంటే మతం పేరిట మేం మనుషులను విడదీసి చూస్తామనడం కుదరదని ఆయన వివరించారు. దంపతుల దేశం, పేర్ల వంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు. వారికి అపీలు చేసుకునేందుకు 30 రోజుల సమయం ఇచ్చారు.

2867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles