న్యూజిలాండ్ కాల్పుల్లో వరంగల్ విద్యార్ధి

Fri,March 15, 2019 10:19 PM

Christchurch mosque massacre 49 confirmed dead

వరంగల్ : న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పుల ఘటన వరంగల్‌లో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెలితే.. న్యూజిలాండ్‌లోని ఓ మసీద్‌లో ప్రార్ధనలు చేసి బయటికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరుపగా 49 మంది మృతి చెంది మరికొందరు గాయపడ్డట్లు సమాచారం. కాగా గాయపడిన వ్యక్తుల్లో వరంగల్ నగరంలోని హన్మకొండకు చెందిన వ్యక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. హన్మకొండ ఏనుగులగడ్డ ప్రాంతానికి చెందిన హసన్ విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లగా శుక్రవారం జరిగిన కాల్పుల్లో గాయపడ్డట్లుగా తెలుస్తోంది. 2010లో వరంగల్ నుంచి హసన్ పాస్‌పోర్టు పొందడంతో స్ధానిక పోలీసులతో పాటు ఎస్‌బీ పోలీసులు హాసన్ గురించి ఆరా తీస్తున్నారు. తెలంగాణకు చెందిన హసన్ కాల్పుల్లో చిక్కుకోవడంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌తో ఘటన గురించి మాట్లాడి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. కాగా హసన్‌కు మూడేళ్ల బాబు, ఆరు నెలల పాప ఉన్నట్లు తెలిసింది.

1841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles