మ‌సీదుల్లో కాల్పులు.. 49కి చేరిన మృతుల సంఖ్య‌

Fri,March 15, 2019 03:04 PM

Christchurch mosque massacre 49 confirmed dead

హైద‌రాబాద్‌: న్యూజిలాండ్‌లో జ‌రిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య 49కి చేరుకున్న‌ది. ఇవాళ ఉద‌యం క్రైస్ట్‌చ‌ర్చ్‌లో రెండు మ‌సీదుల వ‌ద్ద కాల్పులు జ‌రిగాయి. ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంట‌న్ అనే వ్య‌క్తి ఓ మ‌సీదు వ‌ద్ద కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో మ‌రో 48 మంది గాయ‌ప‌డ్డారు. కాల్పుల ఘ‌ట‌న‌తో మ‌సీదులు ఆర్త‌నాదాల‌తో ద‌ద్ద‌రిల్లాయి. సాయుధుడు బ్రెంట‌న్‌ను కివీస్ పోలీసులు అరెస్టు చేశారు. సెమీ ఆటోమెటిక్ వెప‌న్‌తో డీన్స్ ఏవ్‌ మ‌సీదులోకి వ‌చ్చిన అత‌ను విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. దాన్ని లైవ్ కూడా చేశాడు.

లిన్‌వుడ్ వ‌ద్ద ఉన్న మ‌రో మ‌సీదులో కూడా దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో న‌లుగుర్ని అరెస్టు చేశారు. అయితే ఎవ‌రు కూడా అనుమానిత ఉగ్ర‌వాద జాబితాలో లేరు. న్యూజిలాండ్ చ‌రిత్ర‌లో ఇది చీక‌టి రోజు అని ప్ర‌ధాని జెసిండె ఆర్డెన్ తెలిపారు. మ‌రోవైపు న్యూజిలాండ్‌లోని ముస్లిం సంఘాలు ర‌క్త‌దాత‌ల కోసం పిలుపునిచ్చారు. న్యూజిలాండ్ జాతీయ జెండాను పార్ల‌మెంట్ వ‌ద్ద అవ‌న‌తం చేశారు.

1615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles