ఏకధాటిగా వారం రోజులు సెల్‌ఫోన్ వాడింది.. ఆ తర్వాత!

Tue,October 23, 2018 04:49 PM

Chinese Woman unable move fingers after week long smart phone usage

బీజింగ్: ఈ స్మార్ట్‌ఫోన్ల యుగంలో ప్రతి ఒక్కరు తమ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా.. కాస్త ఖాళీ దొరికినా.. స్మార్ట్‌ఫోన్లకే సమయం కేటాయిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. చైనాలోనూ ఇలాగే ఓ మహిళ ఏకంగా వారం రోజుల పాటు ఏకధాటిగా సెల్‌ఫోన్ వాడింది. ఎంతలా అంటే రాత్రి పూట నిద్రిస్తున్న కొద్ది సమయం మాత్రమే ఫోన్‌ను పక్కన పెట్టేది. మిగతా సమయం అంతా రెండు చేతులతో మొబైల్ స్క్రీన్‌పై ఏవో టచ్ చేస్తూ కాలక్షేపం చేసింది. వారం పాటు ఆఫీసుకు సెలవు పెట్టిన సదరు మహిళ.. ఆ సమయం మొత్తం మొబైల్‌కే కేటాయించింది. ఫలితం ఆమె చేతి వేళ్లు బిగుసుకుపోయాయి. రెండు చేతులతో మనం ఎలా మొబైల్‌ను పట్టుకొని వాడుతుంటామో ఆమె వేళ్లు అవే పొజిషన్‌లో కదలకుండా ఉండిపోయాయి.

వాటిని సాధారణ స్థితికి ఆమె తీసుకురాలేకపోయింది. ఏమాత్రం కదిలించాలని చూసిన విపరీతమైన నొప్పి వేధించింది. దీంతో డాక్టర్ దగ్గరకు చికిత్స కోసం వెళ్లింది. టెనోసినివిటిస్‌తో ఆమె బాధపడుతున్నట్లు డాక్టర్లు తేల్చారు. అంటే ప్రతి రోజూ చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం వల్ల ఆమె చేతి వేళ్లలో ఒక రకమైన ఫ్లుయిడ్ నిండినట్లు డాక్టర్లు గుర్తించారు. ఎలాగోలా ఆమెకు చికిత్స చేసి చేతి వేళ్లను మళ్లీ సాధారణ స్థితికి తీసుకు రాగలిగారు. అయితే మళ్లీ ఎప్పుడూ ఈ స్థాయిలో ఫోన్ వాడొద్దని ఓ వార్నింగ్ కూడా ఇచ్చి పంపారు.

7530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles