మా గగనతలంలోకి భారతీయ డ్రోన్ : చైనాThu,December 7, 2017 10:32 AM

మా గగనతలంలోకి భారతీయ డ్రోన్ : చైనా

బీజింగ్ : భారత్‌కు చెందిన డ్రోన్ తమ గగనతలంలోకి ప్రవేశించినట్లు చైనా ఆరోపించింది. చైనా జాతీయ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ డ్రోన్ ధ్వంసమైనట్లు కూడా పేర్కొన్నది. అయితే భారతీయ డ్రోన్‌కు సంబంధించిన ఆనవాళ్ల ఇంకా చిక్కలేదు. డ్రోన్ ఎక్కడ నుంచి వచ్చిందన్న కోణంలో బోర్డర్ పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారని చైనా రక్షణ శాఖ వెల్లడించింది. చైనా సార్వభౌమత్వాన్ని భారత్ ఉల్లంఘించిందని కూడా చైనా మీడియా పేర్కొన్నది. నౌకాదళాన్ని పెంచుకుంటున్న తమను అడ్డుకునేందుకు అమెరికా సాయాన్ని భారత్ కోరుతున్నట్లు కూడా చైనా ఆరోపించింది. చైనా ఆర్మీపై అమెరికన్లను భారత్ రెచ్చగొడుతున్నదని ఓ చైనా పరిశోధకుడు ఆరోపించాడు. కేవలం సముద్ర ప్రాంతాలను పరిరక్షించాలన్న ఉద్దేశంతోనే తమ నౌకాదళాన్ని పెంచుకుంటున్నామని, కానీ భారత్ మాత్రం దీన్ని భిన్నంగా చూస్తోందన్నారు. చైనా ఆర్మీతో ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారమే తమ నౌకాదళాన్ని పటిష్టం చేస్తున్నట్లు ఆ పరిశోధకుడు తెలిపారు.

2620
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS