డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ తప్పించుకోని..ఫ్లైఓవ‌ర్‌ నుంచి దూకి!

Thu,September 20, 2018 12:17 PM

Chinese Man Jumps Off Overpass To Avoid Drink Driving Test

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుంటే వాహనదారులు ఏం చేయాలి. టెస్ట్ చేయించుకోవాలి కదా. ఈ వాహనం డ్రైవర్ ఏం చేసాడో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. ఎందుకు ఈ వ్యక్తి ఇలా చేశాడని షాక్ అవుతారు. ఈ ఘటన చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో చోటు చేసుకున్నది. ఫ్లైఓవ‌ర్‌ నుంచి ఓ వాహనం వెళ్తుంది. సడెన్‌గా వాహనం నుంచి డ్రైవర్ దిగాడు. అటూ ఇటూ చూశాడు. వెంటనే రోడ్డు దాటి ఫ్లైఓవ‌ర్‌ నుంచి కిందికి దూకేశాడు. గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. ఇంతకీ ఇదంతా దేనికి చేశారు సామీ అని అడిగితే.. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ తప్పించుకోవడానికని సల్లగా చెప్పాడు ఆ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

5860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles