విమానంలో లవ్ ప్రపోజల్ ఒప్పుకొని జాబ్ పోగొట్టుకుంది.. వీడియో

Sun,September 16, 2018 01:45 PM

Chinese Flight Attendant Fired After Accepting Mid-Air Marriage Proposal

లవ్ ప్రపోజల్ కొత్తగా ఉండాలని చాలా మంది తహతహలాడుతుంటారు. ఇలాగే ఓ యువకుడు కూడా తన ప్రేయసికి కొత్తగా ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ.. ఆ కొత్త లవ్ ప్రపోజన్ మనోడి లవర్ కొంప ముంచింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకున్నది. ఈ ఘటన చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకున్నది. ఈ ఘటన మేలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత విమానంలోకి ఎయిర్ హోస్టెస్‌కు తన బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేశాడు. సడెన్‌గా అతడు తనకు ప్రపోజ్ చేయడంతో ఏం చేయాలో తెలియక షాక్‌కు గురయింది. తర్వాత మనోడి ప్రపోజల్ నచ్చి ఓకే చెప్పింది. వాళ్ల లవ్ అయితే సక్సెస్ అయింది కానీ.. విమానంలో జరిగిన ఈ ఘటన వల్ల ఆ ఎయిర్ హోస్టెస్ జాబ్ పోగొట్టుకోవాల్సి వచ్చింది.

విమానంలో ప్యాసెంజర్ల బాగోగులు చూడకుండా నీ పర్సనల్ పనులను చేసుకోవడమేందని ఆ యువతిని జాబ్‌లోనుంచి పీకేసిందట సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ. ఆ యువతికి ప్రపోజ్ చేస్తుండగా కొంతమంది వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ విషయం కాస్త ఎయిర్‌లైన్స్ అధికారులకు తెలియడంతో ఆమె జాబ్‌కు ఎసరొచ్చింది. అది సంగతి.

7905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS