అరుణాచ‌ల్ బోర్డ‌ర్‌లో చైనా మిలిట‌రీ డ్రిల్స్‌!Mon,July 17, 2017 12:12 PM

Chinese army conducts live fire drills in Tibet near Arunachal Pradesh Border

బీజింగ్‌: ఓవైపు సిక్కిం స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్న‌ ఈ పరిస్థితుల్లో అరుణాచ‌ల్ స‌రిహ‌ద్దు స‌మీపంలో మిలిట‌రీ డ్రిల్స్ నిర్వ‌హించింది పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ (పీఎల్ఏ). 11 గంట‌ల పాటు ఈ లైవ్ ఫైర్ డ్రిల్ జ‌రిగిన‌ట్లు గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక వెల్ల‌డించింది. అయితే ఎప్పుడు జరిగింద‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదు. పీఎల్ఏకు చెందిన టిబెట్ మిలిట‌రీ క‌మాండ్ ఈ డ్రిల్స్ నిర్వ‌హించిన‌ట్లు ఆ ప‌త్రిక తెలిపింది. ఈ డ్రిల్స్ ద్వారా భార‌త ప్ర‌భుత్వం, ఆర్మీకి గ‌ట్టి హెచ్చ‌రిక‌లు చైనీస్ ఆర్మీ పంపించింది. ఇప్ప‌టికీ అరుణాచ‌ల్‌లోని చాలా ప్రాంతాల‌ను త‌మ భూభాగాలుగా చెప్పుకుంటున్న‌ది చైనా. మ‌న బ్ర‌హ్మ‌పుత్ర‌గా పిలిచే యార్లుంగ్ జాంగ్‌బో న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ఈ డ్రిల్స్ జ‌రిగాయి. సంయుక్తంగా దాడులు చేసేందుకు వివిధ మిలిట‌రీ విభాగాలు ఒక్క‌చోటికి రావ‌డం, యాంటీ ట్యాంక్ గ్రెనేడ్స్‌, మిస్సైల్స్ ప‌రీక్ష‌లు డ్రిల్‌లో భాగంగా నిర్వ‌హించిన‌ట్లు గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక తెలిపింది. అంతేకాదు శ‌త్రువు ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను గుర్తించే రాడార్ యూనిట్లు కూడా ఈ డ్రిల్‌లో పాల్గొన్నాయి.

1980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS