వంట చేసి వడ్డించుకొని తిన్న దేశాధినేతలు.. వీడియో

Wed,September 12, 2018 03:12 PM

Chinese and Russian presidents made pancakes themselves during an Economic Forum

మాస్కో: వాళ్లిద్దరూ ప్రపంచంలోని రెండు శక్తివంతమైన దేశాలకు అధినేతలు. తమ బిజీ షెడ్యూల్ నుంచి వాళ్లు కాస్త సమయం కేటాయించి.. తమ వంట తాము చేసుకొని వడ్డించుకొని తిన్నారు. ఆ ఇద్దరు దేశాధినేతల్లో ఒకరు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కాగా.. మరొకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్. ఓ ఎకనమిక్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ ఇద్దరు నేతలు ఇలా సరదాగా ఓ వోడ్కా పెగ్ తాగుతూ.. రష్యన్ పాన్‌కేక్‌ను స్వయంగా వండుకొని తిన్నారు. రష్యాలోని వ్లాదివోస్టోక్ నగరంలో ఈ ఫోరమ్ జరుగుతున్నది. ఇద్దరు నేతలు వంట చేసే సమయంలో ఆప్రాన్స్ వేసుకున్నారు. తర్వాత పాన్‌లలో కేక్ తయారుచేస్తూ కనిపించారు. అంతకుముందు రెండు దేశాల మధ్య బంధం దృఢమవుతున్నదని ఇద్దరు నేతలు అన్నారు. పైగా ఈ ఇద్దరు నేతలు ఇలా చెఫ్‌లుగా మారడం ఇదే తొలిసారి కాదు. గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో వీళ్లు చైనీస్ పాన్‌కేక్ వండుకొని తిన్నారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఈ మధ్యే రష్యా అతిపెద్ద వార్ గేమ్స్‌కు తెరతీసింది. చైనాతో కలిసి సరిహద్దులో భారీగా సైనిక విన్యాసాలు చేస్తున్నది. ఇందులో రెండు దేశాలకు చెందిన 3 లక్షల మంది సైనికులు పాల్గొన్నారు.


3144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles