48 వేల కోట్లు నష్టపోయిన చైనా రిచెస్ట్ వుమన్!

Mon,October 22, 2018 05:04 PM

Chinas Richest woman loses 66 percent of her wealth in 2018 due to Trade War

బీజింగ్: ఆమె చైనాలోనే అత్యంత ధ‌నిక‌వంతురాలు. ఐఫోన్, టెస్లా టచ్‌స్క్రీన్లు ఒకప్పుడు ఆమెను కోటీశ్వరురాలిని చేశాయి. కానీ ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఆమెను పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసింది. ఈ ఏడాది ఏకంగా తన సంపదలో 66 శాతం కోల్పోయింది జౌ కున్‌ఫీ అనే ఆ మహిళ. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సప్లయర్ లెన్స్ టెక్నాలజీ కంపెనీ చైర్‌పర్సన్ ఆమె. ఈ ఏడాది రెండు అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధంతో ఏకంగా 660 కోట్ల డాలర్లు (సుమారు రూ.48 వేల కోట్లు) నష్టపోయింది. చైనాలోని బిలియనీర్లలో ఎక్కువగా నష్టపోయింది ఆ మహిళే కావడం విశేషం. లెన్స్ టెక్నాలజీ షేర్లు ఈ ఏడాది ఏకంగా 62 శాతం మేర పతనమయ్యాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌లతో లెన్స్ టెక్నాలజీ నుంచి సరఫరాలను ఆపిల్, టెస్లా నిలిపేశాయి. జౌ కున్‌ఫీతోపాటు అలీబాబా గ్రూప్ హోల్డింగ్ ఫౌండర్ జాక్ మా, టెన్సెంట్ హోల్డింగ్స్ సీఈవో మా హువాటెంగ్ కూడా భారీగా నష్టపోయారు.

ప్రపంచంలోని 500 బిలియనీర్ల లిస్ట్‌లో ఉన్న చైనా కోటీశ్వరులు అందరూ కలిసి ఈ ఏడాది ఏకంగా 8600 కోట్ల డాలర్లు నష్టపోయారు. అమెరికా వాణిజ్య విధానం కారణంగా ప్రపంచంలో ఎక్కువగా చైనీస్ స్టాక్స్ నష్టపోయినట్లు ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ వెల్లడించింది. ట్రంప్ ప్రభుత్వం చైనా వస్తువులపై ఎడాపెడా దిగుమతి సుంకాలు విధిస్తుండటంతో అమెరికా సంస్థలు చైనా సప్లయర్స్‌కు దూరం జరుగుతున్నారు. లెన్స్ టెక్నాలజీ చైర్‌పర్సన్ అయిన జౌ 1970లో చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో జన్మించారు. ఆమె తన కెరీర్ మొదట్లో ఆరేళ్ల పాటు ఓ గ్లాస్ కంపెనీలో పని చేశారు. తర్వాత బయటకు వచ్చి షెన్‌జెన్‌లో సొంతంగా కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత లెన్స్ టెక్నాలజీని మొదలుపెట్టి కోట్లకు పడుగలెత్తారు.

1899
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles