రష్యా ఇచ్చిన రక్షణ వ్యవస్థను పరీక్షించిన చైనా

Thu,December 27, 2018 01:44 PM

China Tests Air Defence system imported from Russia

బీజింగ్: రష్యా నుంచి ఇండియా కొనుగోలు చేయాలనుకుంటున్న అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400ను చైనా విజయవంతంగా పరీక్షించింది. 2015లో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ ఏడాది జులైలో చైనాకు ఈ వ్యవస్థ సమకూరింది. దానిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పరీక్షించడం మాత్రం ఇదే తొలిసారి. సెకనుకు 3 కిలోమీటర్ల సూపర్‌సానిక్ స్పీడుతో దూసుకెళ్లిన ఈ డిఫెన్స్ సిస్టమ్.. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. పీఎల్‌ఏ రాకెట్ ఫోర్స్ ఈ ఎస్-400ను పరీక్షించినట్లు రష్యన్ మీడియా వెల్లడించింది. అయితే ఈ పరీక్షను ఎక్కడ నిర్వహించిందన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇదే రక్షణ వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేయడానికి గత అక్టోబర్‌లోనే భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ 500 కోట్ల డాలర్లు. అమెరికా ఆంక్షల భయం వెంటాడుతున్నా.. రష్యాతో భారత్ ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. చైనాతో ఉన్న ఉద్రిక్తల నేపథ్యంలో తన గగనతల రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఇండియా ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ఎస్-400 రక్షణ వ్యవస్థ ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించగలదు.

1890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles