దాడిపై స్పందించని చైనా

Fri,February 15, 2019 01:10 PM

China not responded or condemned the Pulwama Attack

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలన్నీ స్పందించాయి. అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్‌లాంటి అగ్రదేశాలు ఈ కష్టకాలంలో భారత్ వెన్నంటే ఉంటామని ప్రకటించాయి. కానీ చైనా మాత్రం ఇప్పటివరకు ఈ దాడిపై స్పందించలేదు. కనీసం దాడిని ఖండించనూ లేదు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన ఈ దాడిలో 49 మంది జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యకరంగా ఈ జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనకు కూడా చైనా ఎప్పటి నుంచో అడ్డుపడుత్నుది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో చైనా తప్ప మిగతా దేశాలన్నీ ఈ ప్రతిపాదనకు అంగీకరించినా చైనా మాత్రం తన వీటో పవర్‌తో అడ్డుకుంటున్నది. ఇప్పుడదే సంస్థ ఈ దారుణానికి ఒడిగట్టింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌లాంటి దేశాలు మాత్రం ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. అటు జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, చెక్ రిపబ్లిక్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు కూడా ఇండియాకు అండగా నిలిచాయి.

3884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles