ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఉద్రిక్త‌త‌

Fri,January 11, 2019 03:14 PM

బీజింగ్: ద‌క్షిణ చైనా స‌ముద్రం ఇప్పుడు ఉద్రిక్త ప్రాంతంగా మారింది. ప్ర‌స్తుతం అక్క‌డి జ‌లాల్లో అమెరికాకు చెందిన మెక్ క్యాంప్‌బెల్ క్షిప‌ణి విధ్వంస‌క నౌక ప‌హారా కాస్తోంది. జీషా దీవుల్లో ఆ నౌక సంచ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అమెరికా నౌక సంచారంతో.. చైనా అప్ర‌మ‌త్త‌మైంది. త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఇంట‌ర్మీడియ‌ట్ రేంజ్ అణు సామ‌ర్థ్యం క‌లిగిన డీఎఫ్‌-26 క్షిప‌ణి విధ్వంస‌క నౌక‌ను మోహ‌రిస్తోంది. ఫ్రీడ‌మ్ ఆఫ్ నావిగేష‌న్ అన్న సంకేతంతో త‌మ నౌక సంచ‌రిస్తున్న‌ట్లు అమెరికా వెల్ల‌డిస్తోంది. కానీ అమెరికా వాద‌న‌ల‌ను చైనా కొట్టిపారేస్తోంది. త‌మ జ‌లాల్లోకి అమెరికా నౌక‌లు అక్ర‌మంగా ప్ర‌వేశిస్తున్న‌ట్లు చైనా ఆరోపిస్తున్న‌ది. డీఎఫ్‌-26 షిప్ కిల్ల‌ర్ మిస్సైళ్లు సుమారు 5 వేల కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌గ‌ల‌వు. ఈ క్షిప‌ణులు అణ్వాయుధాల‌ను కూడా మోసుకెళ్ల‌గ‌ల‌వు. అమెరికా ప‌శ్చిమ తీర ప్రాంత‌మైన గువామ్ వ‌ర‌కు కూడా ఆ మిస్సైళ్లు వెళ్ల‌గ‌ల‌వు. డీఎఫ్‌-26 నుంచి వ‌దిలిన మిస్సైళ్లు మొద‌ట్లో త‌క్కువ స్థాయిలో ప్ర‌యాణిస్తాయ‌ని, అప్పుడు వాటిని రేడార్ల‌తో ప‌సిక‌ట్ట‌వ‌చ్చు అని, కానీ దూరం వెళ్లిన త‌ర్వాత ఇక వాటిని గుర్తించ‌లేమ‌ని చైనా అధికారులు చెబుతున్నారు. అమెరికా యుద్ధ నౌకకు వార్నింగ్ ఇచ్చేందుకు త‌మ యుద్ధ నౌక‌ను సిద్ధం చేసిన‌ట్లు చైనా వెల్ల‌డించింది.

2638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles