భార్యకు తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని రోడ్డుపై నిల్చున్నాడు.. ఆ తర్వాత..

Fri,March 15, 2019 12:53 PM

China Man stands on busy road after arguing with wife ends up in hospital

బీజింగ్: ప్రేయసికి తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి బిజీ రోడ్డు మధ్యలో హీరో నిల్చున్న సీన్లు మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి మాత్రం అది నిజ జీవితంలోనే జరిగింది. చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని లిషుయ్‌లో పాన్ అనే ఓ వ్యక్తి తాగిన మత్తులో ఈ పని చేశాడు. భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. పీకలదాకా తాగి భార్యకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత రోడ్డుపైనే ఇద్దరూ కాసేపు తిట్టుకున్న తర్వాత పాన్ వెళ్లి బిజీ రోడ్డు మధ్యలో నిల్చున్నాడు. భార్య తనను ఎంత లాగడానికి ప్రయత్నించినా.. అతను మాత్రం అలాగే మొండిగా నిల్చున్నాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ వచ్చి అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు, ఛాతీకి తీవ్ర గాయాలతో పాన్ ఆసుపత్రి పాలయ్యాడు. నాపై నిజంగా నా భార్యకు ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని రోడ్డుపై నిల్చున్నాను. చివరికి ఇలా అయింది అంటూ ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతూ వాపోతున్నాడు పాన్.

11064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles