వీడియో: హోటల్‌లో రూం ఇవ్వలేదని రిసెప్షనిస్టును...

Wed,December 6, 2017 06:12 PM

China man sprays with Fire Extinguisher after she rejects room in hotel

హోటల్‌లో ఉండే రిసెప్షనిస్ట్‌పై అతి దారుణంగా, ఏమాత్రం కనికరం లేకుండా మంటలార్పే సాధనం(ఫైర్ ఎక్స్టింగ్విష‌ర్‌) తో స్ప్రే చేశాడు ఓ వ్యక్తి. కేవలం ఆ హోటల్‌లో రూం బుక్ చేయనందుకు ఆ రిసెప్షనిస్ట్‌పై అలా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ ఘటన చైనాలోని గ్జియాన్ సిటీలో చోటు చేసుకున్నది. ఓ కస్టమర్ హోటల్‌కు ఫోన్ చేసి రూం కోసం వాకబు చేశాడు.

అయితే.. అతడి డిటేయిల్స్ చెప్పకపోవడంతో అతడికి రూం ఇవ్వడానికి హోటల్ రిసెప్షనిస్ట్ నిరాకరించింది. దీంతో కోపంతో రగిలిపోయిన ఆ వ్యక్తి వెంటనే హోటల్‌కు వచ్చి రిసెప్షనిస్ట్‌పై ఫైర్ ఎక్స్టింగ్విష‌ర్‌తో విరుచుకుపడ్డారు. తనపై స్ప్రే చల్లాడు. దీంతో కొంతసేపటి వరకు అక్కడ ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కాలేదు. వెంటనే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆ వ్యక్తిని ఆపి ఆ సాధనాన్ని లాక్కొన్నాడు. తర్వాత తేరుకున్న ఆ యువతి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటన అంతా హోటల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

4367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS