చైనా మరో ఘనత.. ప్రపంచంలోనే తొలి కృత్రిమ మేధస్సు న్యూస్ యాంకర్ ఇది!

Fri,November 9, 2018 01:29 PM

China introduces worlds first AI News Anchor

బీజింగ్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ, కృత్రిమ మేధస్సు) కొంప ముంచుతున్నది. ప్రపంచంలో ఈ కృత్రిమ మేధస్సు కారణంగా లక్షల మంది తమ ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంటున్నది. అసలు ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా భద్రత ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా చైనాలో ఏఐ-టెక్నాలజీని ఉపయోగించి న్యూస్ యాంకర్‌కు ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చారు. చైనా అధికారిక న్యూస్ చానెల్ జినువా ఇప్పుడు ఏఐ యాంకర్లను బరిలోకి దింపింది. ఈ యాంకర్లు 365 రోజులు నాన్‌స్టాప్‌గా ప్రపంచంలోని ప్రతి మూల జరిగిన వార్తలను ప్రజలకు అందజేస్తాయని జినువా వెల్లడించింది. జినువా న్యూస్‌లో రెగ్యులర్‌గా కనిపించే కియు హావో అనే యాంకర్ డిజిటైజ్డ్ వర్షన్‌ను రూపొందించి ఆ చానెల్ ఈ ప్రకటనను చేయించింది.మీకు 365 రోజులూ అందుబాటులో ఉంటాను. అన్ని వార్తలను అందిస్తాను అని ఆ ఏఐ యాంకర్ చెప్పడం విశేషం. ఈ ఏఐ టెక్నాలజీని జినువా, చైనీస్ రీసెర్చ్ ఇంజిన్ సోగో కలిసి అభివృద్ధి చేశాయి. ఈ డిజిటల్ యాంకర్స్ మెషీన్ లెర్నింగ్ ద్వారా తమకు తాము అభివృద్ధి చెందాయి. అంతేకాదు అసలు యాంకర్లలాగే మాట్లాడటం, ముఖ కవళికలు, హావభావాలను కూడా ఇవి నేర్చుకున్నాయి. దీని వల్ల ఓ రోబో మాట్లాడుతున్న ఫీలింగ్ కాకుండా నిజమైన యాంకరే వార్తలు చదువుతున్నట్లుగా ఉంటుందని జినువా చెప్పింది. చైనా వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్‌లో భాగంగా ఈ యాంకర్లు అరంగేట్రం చేశాయి.

6016
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles