Telangana Intermediate 1st & 2nd Year Results 2019

చైనా ఖండించింది కానీ..!

Fri,February 15, 2019 03:19 PM

China condemned the attack but refused to back Indias proposal to brand Masood Azhar as global terrorist

న్యూఢిల్లీ: పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడిపై మొత్తానికి చైనా స్పందించింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. అయితే అదే సమయంలో ఈ దాడికి కారణమైన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి అంగీకరించలేదు. ఈ దాడి మమ్మల్ని చాలా షాక్‌కు గురి చేసింది. ఈ దాడిలో అమరులైన, గాయపడిన వారికి మా నివాళులు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అన్ని దేశాలు కలిసి రావాలి అని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ అన్నారు. మరి మసూద్ అజర్‌పై తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా అని ప్రశ్నించగా.. ఆయన పాత పాటే పాడారు. ఇప్పటికే భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం జాబితాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పేరు ఉంది. అయితే వ్యక్తులను ఈ జాబితాలో చేర్చే విషయంలో మేము ఎప్పుడూ ఎంతో ప్రొఫెషనల్‌గా, బాధ్యతాయుతంగా వ్యవహరించాం అని ఆయన చెప్పారు.

ఈ జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనకు చైనా ఎప్పటి నుంచో అడ్డుపడుత్నుది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో చైనా తప్ప మిగతా దేశాలన్నీ ఈ ప్రతిపాదనకు అంగీకరించినా చైనా మాత్రం తన వీటో పవర్‌తో అడ్డుకుంటున్నది. ఇప్పుడదే సంస్థ ఈ దారుణానికి ఒడిగట్టింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌లాంటి దేశాలు మాత్రం ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. అటు జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, చెక్ రిపబ్లిక్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు కూడా ఇండియాకు అండగా నిలిచాయి.

3186
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles