చైనా మళ్లీ.. మసూద్ విషయంలో అడ్డుపడుతున్న డ్రాగన్!

Wed,March 13, 2019 02:45 PM

China again hints at blocking UN Security Council move to declare Masood Azhar as International Terrorist

బీజింగ్: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానంపై మరికొద్ది గంటల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్చించనుంది. ఈ సమయంలో మరోసారి ఈ తీర్మానాన్ని అడ్డుకుంటామన్న సందేశాన్ని చైనా పంపించింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమైతేనే అంగీకరిస్తామని ఆ దేశం ప్రకటించింది. మరో 24 గంటల్లోపే మసూద్ అజర్.. అంతర్జాతీయ ఉగ్రవాదా కాదా అన్న విషయం స్పష్టం కానుంది. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను ఫ్రాన్స్, యూకే, అమెరికా.. సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకు తీసుకొచ్చాయి. దీనిపై చైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, చర్చల్లో పాల్గొంటుందని స్పష్టం చేస్తున్నాను అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ వెల్లడించారు. ఇప్పటికే తనకున్న వీటో పవర్‌తో మూడుసార్లు మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కావాలంటూ చైనా అడుగుతూ వస్తున్నది. చర్చలు అన్ని రకాల నిబంధనలు, ప్రక్రియలను పాటించాలని, చివరికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించాలని చైనా భావిస్తున్నట్లు లు కాంగ్ చెప్పారు.

1473
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles