బట్టలు ఉతికిన చింపాంజీ.. వీడియో వైరల్‌

Tue,December 10, 2019 03:50 PM

కొన్ని సందర్భాల్లో చింపాంజీ.. మనిషి మాదిరిగానే ప్రవర్తిస్తుంది. అచ్చం మనషుల్లాగే చింపాంజీలు కూడా పనులు చేస్తుంటాయి. చైనాలోని ఓ జూపార్కులో చింపాంజీ.. బట్టలు ఉతికింది. జూ కీపర్‌ సుర్నామ్డ్‌ క్సూ చింపాంజీల ఎన్‌క్లోజర్‌లో బట్టలు ఉతికేది. ఆమె బట్టలు ఉతికినప్పుడల్లా.. ఓ చింపాంజీ గమనిస్తూ ఉండేది. దీన్ని గమనించిన జూ కీపర్‌.. నీళ్ల తొట్టె వద్ద టీ షర్ట్‌, బ్రష్‌, సబ్బును వదిలేసి వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత ఆ చింపాంజీ నీళ్ల తొట్టె వద్దకు చేరుకుని టీషర్ట్‌కు సబ్బు పెట్టి బ్రష్‌తో ఉతికేసింది. బట్టలు ఇలా వాష్‌ చేయాలని చింపాంజీకి తానెప్పుడూ శిక్షణ ఇవ్వలేదని జూ కీపర్‌ స్పష్టం చేశారు. చింపాంజీ బట్టలు వాష్‌ చేయడాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

1888
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles