చీపురు పట్టిన చింపాంజీ.. స్వచ్ఛ్ ఎన్‌క్లోజర్.. వీడియో

Thu,January 24, 2019 04:58 PM

చింపాంజీ చీపురు పడితే ఎలా ఉంటదో తెలుసా? చూడండి.. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. అది ఊడ్చినంత క్లీన్‌గా ఎవరూ ఊడ్చలేరు. మనుషులు వేస్ట్ దానికింద. ఇప్పుడు అంతా స్వచ్ఛ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి కదా. దానికి కొంపదీసి ఈ విషయం తెలిసిందో ఏమో.. చీపురు పట్టింది. తన ఎన్‌క్లోజర్‌ను తనే క్లీన్ చేసుకుంది. అచ్చం తన ట్రెయినర్ ఎలా రోజూ ఎన్‌క్లోజర్‌ను క్లీన్ చేస్తాడో.. అతడిని ఇమిటేట్ చేస్తూ అచ్చు అలాగే ఊడ్చేసింది. చింపాంజీ ఊడుస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు తన ట్రెయినర్. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు కూడా చింపాంజీ ఊడ్చే వీడియోను చూసి ఫిదా అయిపోతున్నారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి నిన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన చైనాలోని షెన్యాంగ్ సిటీలోని చోటు చేసుకున్నది.

18 ఏళ్ల వయసు ఉన్న చింపాంజీ ఐక్యూ.. మూడు నాలుగేళ్లు ఉన్న చిన్నారి ఐక్యూతో సమానం. రోజూ నేను తన ఎన్‌క్లోజర్‌లో చేస్తున్న పనిని గ్రహించి.. ఇలా నేను లేని సమయంలో తనకు తానే చొరవ తీసుకొని ఎన్‌క్లోజర్‌ను ఊడ్చేసుకున్నది.. అంటూ చింపాంజీ ట్రెయినర్ తెలిపాడు. ఊడ్చ‌డ‌మే కాదు.. బ‌ట్ట‌లు పిండ‌టం.. చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం, ఈల‌లు వేయ‌డం కూడా నేర్చుకున్న‌ద‌ట ఆ చింపాంజీ.

2618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles