వీడు పిల్లోడు కాదు.. చిచ్చర పిడుగు.. వైరల్ వీడియో

Mon,June 24, 2019 05:35 PM

child playing with giant python video goes viral

చూస్తే నిండా రెండేళ్లు కూడా లేవు కానీ.. ఈ పిల్లోడు ఏకంగా పేద్ద కొండ చిలువతో ఆటలాడుతున్నాడు. వీడు నిజంగా పిల్లోడేనా అసలు. ఆ కొండ చిలువ తలుచుకుంటే ఆ పిల్లాడిని లటక్కున మింగేయగలదు. కానీ.. ఏమాత్రం భయం లేకుండా ఆ పిల్లోడు ఓ బొమ్మతో ఆడుకుంటున్నట్టుగా దానితో ఆడుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రెండేళ్లు కూడా లేని పిల్లోడు అంత పెద్ద కొండ చిలువతో ఆడుకోవడం ఏంటబ్బా అని నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ పిల్లాడి ఫ్యామిలీ కొండ చిలువలను సాదుకుంటుందా ఏంది? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా చిన్న పామును చూస్తేనే పిల్లలు దడుసుకుంటారు. ఆ పిల్లాడు మాత్రం కొండ చిలువ తల పట్టుకొని అటూ ఇటూ తిప్పుతుంటే.. దాని మీద కూర్చొని ఆటలాడుతుంటే అది కూడా ఆ పిల్లోడిని ఏమీ అనకపోవడం విశేషం. అది కూడా మనోడి ఆటలను ఎంజాయ్ చేస్తుంది కాబోలు. మీరేమన్నా ట్రై చేస్తారా దానితో ఆడుకోవడానికి? వామ్మో మావల్ల కాదంటారా? సరే.. కనీసం ఆ వీడియో అయినా చూడండి.


3646
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles