2.4 కిలోల చికెన్ ఖరీదు 1,46,00,000

Thu,August 23, 2018 05:53 PM

chicken cost in crores

అవి రూపాయలు కావు.. వెనిజులా కరెన్సీ. ఆ 2.4 కిలోల చికెన్ కొనాలంటే అచ్చంగా కోటి 46 లక్షల బాలివర్లు చెల్లించాల్సిందే. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వెనిజులాలో ద్రవ్యోల్బణం శ్రుతి మించడంతో లోకల్ కరెన్సీ అయిన బాలివర్లకు విలువ లేకుండా పోయింది. రాజధాని కారకాస్‌లో ఓ చికెన్ షాప్‌లో ఇలా డిస్‌ప్లే పెట్టారు. ఆమాత్రం చికెన్‌కు లోకల్ కరెన్సీలో చిన్న నోట్లయితే అంత మొత్తం చెల్లించాలని కేటియా బస్తీలో ఓ దుకాణాదారు ఈ ఏర్పాటు చేశాడు. కష్టాల్లో కూడా కళాత్మకత అంటే ఇదే. ఇంతాచేస్తే అమెరికా కరెన్సీలో అది 2.22 డాలర్లు మాత్రమే. మన కరెన్సీలో అయితే ఓ నూటాయాభై రూపాయలు.. అంతే! అందుకే చిన్నచితకా నోట్లను జనం చెత్తకుండీల్లో వేస్తున్నారు.

10886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles