ఎంజైమ్‌ల‌ను విశ్లేషించిన ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు కెమిస్ట్రీ నోబెల్‌

Wed,October 3, 2018 03:39 PM

Chemistry Nobel prize goes to Frances H. Arnold, George P. Smith and Sir Gregory P. Winter

స్టాక్‌హోమ్: రసాయనశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ వరించింది. ఫ్రాన్సెస్ హెచ్. అర్నాల్డ్, జార్జ్ పీ స్మిత్, సర్ గ్రెగరీ పీ వింటర్‌లు ఈ ఏడాది సంయుక్తంగా కెమిస్ట్రీ నోబెల్ గెలుచుకున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పేర్లను ప్రకటించింది. అవార్డులో సగం అమౌంట్ ఫ్రాన్సెస్ అర్నాల్డ్‌కు దక్కనున్నది. ఎంజైమ్‌లపై చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డులు దక్కాయి. జీవపరిణామ సిద్ధాంతం మాదిరిగా ఎంజైమ్‌లను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. జీవరసాయన పరిశ్రమల అభివృద్ధి కోసం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని డెవలప్ చేశారు. కొత్త వస్తువుల సృష్టి, సుస్థిర జీవ ఇంధన ఉత్పత్తి, వ్యాధుల నిర్మూలన, ప్రాణులను రక్షించేందుకు కావాల్సిన ఫార్ములాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. జీవపరిణామ క్రమాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు తమ ఆధీనంలోకి తీసుకున్నారని నోబెల్ కమిటీ తన ప్రకటనలో వెల్లడించింది.జన్యు మార్పులు, జన్యు ఎంపిక ఆధారంగా ప్రోటీన్లను అభివృద్ధి చేశారన్నారు. సర్ గ్రెగరీ వింటర్ తన పరిశోధనలతో కొత్త తరహా ఫార్మస్యుటికల్స్ సృష్టించినట్లు నోబెల్ కమిటీ పేర్కొన్నది. ఫేస్ డిస్‌ప్లేతో వ్యాధులతో పోరాడే యాంటీబాడీలను ఆయన అభివృద్ధి చేశారు. శాస్త్రవేత్త జార్జ్ స్మిత్ బ్యాక్టీరియోఫేజ్ పద్దతిని డెవలప్ చేశారు. బ్యాక్టీరియాను ఆక్రమించే వైరస్‌ను ఆయన కనుగొన్నారు. ఈ పద్ధతితో కొత్త ప్రోటీన్ల క్రమాన్ని విశ్లేషించవచ్చు. ఎంజైమ్‌ల విశ్లేషణాక్రమాలను మొదటిసారి ఫ్రాన్సెస్ అర్నాల్డ్ నిర్వహించారు. పరిణామక్రమ సిద్ధాంతం ద్వారా ఎంజైమ్‌ల నుంచి ఆమె బయో ఇంధనాలు, కొత్త తరహా ఫార్మాస్యుటికల్స్‌ను సృష్టించారు.

1031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles