ఫ్రెండ్‌ను బస్సు కింద తోసేసింది.. జస్ట్ మిస్.. వీడియో

Sat,April 21, 2018 03:18 PM

CCTV Captures Woman Pushing Friend Under Bus in Poland

అది పోలాండ్‌లోని పాలిష్ టౌన్. ఇద్దరు మహిళలు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో రోడ్డు పక్కన ఓ బస్సు వెళ్తున్నది. వెంటనే ఆ మహిళ పక్కనే నడుస్తున్న తన ఫ్రెండ్‌ను బస్సు కిందికి తోసేసింది. అంతే.. ఈ ఘటనను చూసిన వాళ్లంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. అసలక్కడ ఏం జరుగుతందో అర్థం చేసుకోలేకపోయారు. సేమ్.. బస్సులో ఉన్నవాళ్లు కూడా అలాగే ఫీల్ అయ్యారు. బస్సు డ్రైవర్ కూడా వెంటనే బస్సును ఆపేశాడు. అయితే.. అదృష్టవశాత్తు ఆ మహిళకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. సేఫ్‌గా బయటపడింది. కాని.. జస్ట్‌లో చావును తప్పించుకుంది. కొంచెం ముందు పడి ఉండే.. ఆమె తల చిద్రమైపోయేది. అయితే. ఇదంతా ఎందుకు చేశావు అని ఆ మహిళను అడిగితే.. ఎహె.. ఇదంతా ప్రాంక్.. ఏదో సరదాకు అలా చేశాను అని అన్నదట ఆ మహిళ. వామ్మో.. ఇటువంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా? ఇక‌.. ఈ ఘ‌ట‌న అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి.


5562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS