తొమ్మిదో ఫ్లోర్ నుంచి కింద పడినా బతికింది.. వీడియో

Wed,April 25, 2018 05:11 PM

Cat survived after thrown out from nine storey building in western Russia

తొమ్మిదో ఫ్లోర్ నుంచి కింద పడితే బతికి బట్టకట్టగలమా. కాని.. ఓ పిల్లి బతికి బట్టకట్టింది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నమ్మాల్సిన నిజం. ఈ ఘటన వెస్టర్న్ రష్యాలోని లైస్క్ సిటీలో చోటు చేసుకున్నది. పిల్లి ఓనరే దాన్ని కావాలనే తొమ్మిదో ఫ్లోర్ నుంచి కిందికి పడేశాడట. దాంతో అది తిన్నగా కారు బానెట్ మీద పడి ఎగిరి కిందికి దూకి.. ఏమీ ఎరుగనట్లు అక్కడి నుంచి జారుకున్నది. ఇక.. ఈ వీడియోను పిల్లి ఓనరే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పిల్లి తన కారు బానెట్ మీద పడటంతో కారుకు ఎన్ని సొట్టలు పడ్డాయో తెలుసుకోవడం కోసమే ఆ వీడియోను పోస్ట్ చేసినట్లు ఆయన తెలిపాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారటమే కాకుండా నెటిజన్లు పిల్ల ఓనర్‌పై మండిపడుతున్నారు.

3955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles