డ్రగ్స్ పట్టిచ్చింది కుక్క కాదు పిల్లి!

Tue,September 18, 2018 08:04 PM

cat finds drugs

డ్రగ్స్ లేదా పేలుడు పదార్థాల వంటివి పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను వినియోగిస్తుంటారు. వీటికి మీడియా ముద్దుగా పోలీసు జాగిలాలు అనే పేరు కూడా తగిలించింది. ఇకనుంచి పోలీసుమార్జాలాలు అని కూడా వినాల్సొస్తుందేమో. ఎందుకంటే ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌లో ఓ పిల్లి డ్రగ్స్ గుట్టు రట్టుచేసి సంచలనం కలిగించింది. సంగతేంటంటే.. అది ఎక్కడి నుంచో ఓ ప్లాస్టిక్ సంచీ నిండా డ్రగ్స్ పట్టుకొచ్చి యజమాని ముందు పోసింది. అది చూసి ఠారెత్తిన ఆ యజమాని పోలీసులకు కబురు పెట్టాడు. పోలీసులు సోషల్ మీడియాలో ఆ సంగతి వెల్లడించారు.

అంతేకాకుండా కుక్కలు కాదు డ్రగ్స్ పట్టుకునేందుకు ఇకనుంచి పిల్లులకు ట్రైనింగ్ ఇవ్వాలేమో అని కామెంట్ కూడా పెట్టారు. నిజానికి సంచీలో ఉన్నవి డ్రగ్స్ అనే సంగతి ఇంకా తేలలేదు. కాకపోతే పేపర్లో చుట్టిన విధానం డ్రగ్స్ పొట్టాల్లాగే ఉంది. దీనిపై కొందరు ఆహాశ్చర్యం వ్యక్తం చేస్తే మరికొందరు పిల్లేమిటి.. డ్రగ్స్ బయటపెట్టడం ఏమిటి అని కొట్టిపారేస్తున్నారు. అసలు పిల్లికి ప్లాస్టిక్ సంచీని లాక్కొచ్చే అలవాటు ఉండదని కొందరు తేల్చేస్తున్నారు. పిల్లి పేరుమీద ఇంగ్లండ్ పోలీసులు బకరాలయ్యారా ఏమిటి?

4064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS