హరికేన్ ఫ్లోరెన్స్.. వణుకుతున్న కరోలినా

Fri,September 14, 2018 04:56 PM

Carolina states struck with Hurricane Florence

గ్రీన్‌విల్లే: కరోలినా రాష్ట్ర తీరాలను హరికేన్ ఫ్లోరెన్స్ తాకింది. దీంతో బీచ్ టౌన్లలో వర్షాలు పడుతున్నాయి. ఫ్లోరెన్స్ మరింత భీకరంగా మారనున్నది. తీరాల వద్ద గంటకు 100 మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. నార్త్, సౌత్ కరోలినా రాష్ర్టాల్లో అప్రమత్తత ప్రకటించారు. ఎమర్జెన్సీ వర్కర్లు రెఢీలో ఉన్నారు. కరోలినా రాష్ర్టాల్లో హరికేన్ ఫ్లోరెన్స్ వల్ల కొన్ని ప్రాంతాల్లో సుమారు 40 ఇంచుల మేర వర్షం కురవనున్నది. ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాల వల్ల వరదలు వస్తున్నాయి. బలమైన గాలులకు కొట్టుకుపోతున్నాయి. ఫ్లోరెన్స్ వల్ల అనేక మంది మరణించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

2300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles