లిబియాలో కారు బాంబు పేలుళ్లు..33 మంది మృతి

Wed,January 24, 2018 09:21 AM

car bombing blasts in libya today 33 dead

లిబియా: లిబియాలో గుర్తు తెలియని దుండగులు కారు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. సెంట్రల్ అల్ సల్మనీ జిల్లా పశ్చిమ బెన్‌ఘాజీ పట్టణంలోని మసీదు ప్రాంగణంలో ఈ పేలుళ్లు సంభవించాయి. బాంబు పేలుళ్లలో 33మంది ప్రాణాలు కోల్పోగా..మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు.

సమాచారమందుకున్న భద్రతాబలగాలు, వైద్య శాఖ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి వచ్చిన 15 నిమిషాల సమయంలోనే మరో భారీ బాంబు పేలుడు సంభవించింది. రెండోసారి జరిగిన పేలుడులో అంబులెన్స్‌లో ఉన్న చాలా మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో మిలటరీ దళాలు, వైద్య సిబ్బంది, ప్రజలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉన్నదని..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవలి కాలంలో లిబియాలోని మసీదు పరిసర ప్రాంతాల్లో తరచూ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.


2258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles