వీడియో: వృద్ధురాలు రోడ్డు దాటడానికి సాయపడిన కారు

Fri,November 17, 2017 08:01 PM

Car blocks traffic to ensure old woman cross the road in china

ఈ భూమ్మీద‌ ఒకరు కాకపోయినా.. ఎవరో ఒకరు.. ఏదో ఒక రూపంలో సాయపడతారనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ వృద్ధురాలను మానవత్వం కారు రూపంలో పలకరించింది. బిజీ రోడ్డు మీద రోడ్డు దాటడానికి తాపత్రయపడుతున్న ఆమెను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.

కాని.. జీబ్రా క్రాసింగ్ దగ్గర ఓ వృద్ధురాలు రోడ్డు దాటాడానికి ప్రయత్నిస్తుంటే.. ఓ కారు మాత్రం ఆ వృద్ధురాలు రోడ్డు ఎప్పుడు దాటుతుందా అని ఎదురు చూస్తున్నది. కాని.. ఏ వాహనం ఆమెను రోడ్డు దాటకుండా ఒకదాని వెనక మరోటి వెళ్తుండటంతో.. ఆ కారు వెంటనే రోడ్డుకు అడ్డంగా తిరిగి ట్రాఫిక్‌ను బ్లాక్ చేసింది.

వెంటనే ఆ వృద్ధురాలు సేఫ్‌గా రోడ్డు దాటి వెళ్లిపోయింది. ఈ ఘటన చైనాలోని జెజియాంగ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేయడమే కాదు.. వృద్ధ మహిళ రోడ్డు దాటడానికి సహకరించిన కారును నెటిజన్లు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

5043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles