ఆద్యంతం న‌వ్వు తెప్పించే ఫ‌న్నీ దొంగ‌త‌నం.. వీడియో

Mon,March 12, 2018 06:38 PM

Candy Crook snatching gumball machine video goes viral

ఈ వీడియో చూస్తున్నంత సేపు చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్ గుర్తుకువస్తారు. మూకీ ప్రదర్శనతో చార్లీ చాప్లిన్ ఎలా ఆకట్టుకుంటాడో అందరికీ తెలిసిందే. ఇక.. మిస్టర్ బీన్ కూడా తన ప్రవర్తనతో ఎలా నవ్వు పుట్టిస్తాడో తెలుసు. సేమ్.. ఈ వీడియోలో కూడా దొంగతనం చేయడానికి మనోడు పడ్డ పాట్లు అచ్చం వాళ్ల నటనను తలపిస్తాయి. ఇక.. అసలు విషయానికి వస్తే..

యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఓ యానిమల్ షెల్టర్ ఉంది. అక్కడ యానిమల్స్ కోసం ఓ ఫండింగ్ మిషన్ ఉంటుంది. దాని మీద కొన్ని గమ్ బాల్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా యానిమల్స్ కోసం ఫండ్ ఇవ్వాలనుకుంటే ఆ మిషన్‌లో వేయాలి. వాళ్లకు ఓట్ ఆఫ్ థాంక్స్‌లాగా అక్కడ గమ్ బాల్స్ ఉంటాయి కదా. వాటిని తీసుకోవచ్చు. ఇక ఆ గమ్‌బాల్ మిషన్‌పై ఓ వ్యక్తి కన్ను పడింది. ఓ రోజు అర్ధరాత్రి షెల్టర్ తలుపులు పగులగొట్టి మరీ లోపలికి వచ్చి ఆ మిషన్‌ను ఎత్తుకెళ్లడానికి తెగ ప్రయత్నించాడు. కాని.. దాన్ని తీసుకెళ్లే మార్గం మాత్రం దొరకలేదు. దాన్ని దొంగతనం చేయడానికి మనోడు పడ్డ పాట్లన్నీ ఆ యానిమల్ షెల్డర్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ దొంగను పట్టించేందుకు సహాయం చేయాలని కోరారు. ఇక.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

5706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles