కనుగుడ్డుకు టాటూ వేసుకొని కంటి చూపు పోగొట్టుకుంది!

Sun,December 3, 2017 10:47 PM

Canadian Model Tattooed her eyeball purple and lost her eye vision

మోడల్స్ అంటే తెలుసు కదా.. రోజు మేకప్, ప్యాకప్.. ప్రతి రోజు వాళ్ల అందాన్ని పెంచుకుంటూనే ఉండాలి. దాని కోసం వాళ్లు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అలా అయితేనే వాళ్లు మోడల్స్‌గా రాణిస్తారు. అలాంటి తిప్పలే పడి తన కంటి చూపును పోగొట్టుకుంది కెనడాకు చెందిన మోడల్ కాట్ గాల్లింగర్. తన కుడి కన్ను తెల్ల గుడ్డుకు పర్పుల్ కలర్ ఇంక్‌తో టాటూ వేయించుకొని ఇప్పుడు కంటి సమస్యతో బాధపడుతున్నది.

కొన్ని నెలల క్రితం తను ఈ సాహసానికి పూనుకున్నది. ఇంక్‌ను కనుగుడ్డుకు వేసుకున్న మొదటి రోజు నుంచే తనకు కనుచూపు మందగించడం స్టార్ట్ చేసిందట. అంతే కాదు.. రోజూ తన కంట్లో నుంచి ఆ కలర్ కారుతూ ఉంటుంది. ఇంక్ వల్ల కన్నుకు ఇన్ఫెక్షన్ వచ్చి ఇప్పుడు కన్ను మసకమసక కనిపిస్తుంది. కంటి సమస్య నుంచి బయట పడటానికి కాట్ వాడని మందులు లేవు.. తిరగని హాస్పిటల్స్ లేవు. ఏం చేసినా.. కంటి చూపును మాత్రం తిరిగి సంపాదించడం అసాధ్యం అని తేల్చేశారు డాక్టర్లు. దీంతో మసక మసకగా కనిపిస్తున్న కంటితో, ఇన్ఫెక్షన్‌తో వస్తున్న నొప్పిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నదట కాట్.

అందుకే తనలాంటి సమస్య మరెవరికీ రాకూడదని ఫేస్‌బుక్ వేదికగా తన స్టోరీని అందరితో పంచుకొని.. ఎవరూ ఇటువంటి సాహసాలకు ఒడికట్టొద్దని తన కన్ను ఫోటోలను షేర్ చేసి నెటిజన్లను మేల్కొలుపుతున్నది.

3517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles