ఈ ప్రపంచ మ్యాప్‌లో ఉన్న తప్పేంటో చెప్పుకోండి చూద్దాం..

Fri,February 8, 2019 06:19 PM

Can You Spot The Glaring Error In This World Map By Ikea?

స్వీడన్‌కు చెందిన ఫర్నీచర్ కంపెనీ ఐకియాపై ప్రస్తుతం నెటిజన్లు ఫైరవుతున్నారు. ఐకియా నిర్లక్ష్యాన్ని సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటారా? ఐకియా.. ప్రపంచ మ్యాప్‌ను అమ్మకానికి పెట్టింది. వాషింగ్టన్ డీసీలోని తన ఔట్‌లెట్‌లో ఈ మ్యాప్‌ను అమ్మకానికి పెట్టింది. పైన మీరు చూస్తున్న మ్యాప్ అదే. కాకపోతే.. దాంట్లో ఓ స్పష్టమైన తప్పు ఉంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం. కాస్త పరికించి చూడండి మీకే తెలుస్తుంది.

Ikea's map game is not on point from r/MapsWithoutNZ


చూశారా? ఆ మ్యాప్‌లో ఉన్న తప్పేంటో గమనించారా లేదా.. అయ్యో మీకు ఇంకా అర్థం కాలేదా? మ్యాప్ కుడి వైపు కింద చివర చూడండి. ఆస్ట్రేలియా కనిపించిందా? మరి దాని కింద ఉండే న్యూజిలాండ్ ఏది.. లేదు కదా. అదే ఐకియా చేసిన తప్పు. ఆ తప్పును గమనించిన రెడిట్ యూజర్.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఏకంగా ఓ దేశాన్నే లేపేశారుగా.. న్యూజిలాండ్ అనే ఓ దేశం ఈ ప్రపంచంలో ఉంది.. ఇలా మరిచిపోతే ఎలా ఐకియా.. అంటూ నెటిజన్లు ఆ వీడియోపై స్పందించడం మొదలు పెట్టారు.6685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles