మెదడుకు మేత.. ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి చూద్దాం!

Thu,April 12, 2018 03:53 PM

ఇనుమును వాడకుండా అలాగే ఉంచితే తుప్పు పట్టిపోతుంది. దీంతో దాన్ని మళ్లీ ఉపయోగించలేం. మరి.. మన మెదడు.. అది కూడా అంతే. దాన్ని కూడా వాడకుండా ఉంటే తప్పు పడుతుంది. అందుకే మన మెదడును ఎప్పటికప్పుడు పదును పెడుతూ ఉండాలి. దాని కోసమే ఈ పజిల్. మీరు రెడీయా...


ఓకే.. అయితే మీరు పైన చూస్తున్న ఫోటోయే పజిల్. దాన్ని ఓ సారి పరీక్షించండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. చూశారుగా.. ఏంటో అంతా గజిబిజిగా ఉంది. ఇంతకీ పజిల్ ఏంటి అంటారా? పైన ఉన్న ఒక్క ఫోటోలోనే రెండు రకాల ఫోటోలు ఉన్నాయి.

లెఫ్ట్‌లో ఉన్న ఫోటోకు, రైట్ సైడ్ ఉన్న ఫోటోకు మధ్య 8 తేడాలు ఉన్నాయి. ఆ తేడాలే మీరు కనిపెట్టాల్సింది. ఇంకెందుకు ఆలస్యం. మీ మెదడుకు పదును పెట్టండి మరి.

సరె.. ఆ ఫోటో సరిగా కనిపించకపోతే కింద మరో ఫోటో ఇస్తున్నాం. ఇది కొంచెం క్లియర్‌గా ఉంటుంది. దీన్ని చూసి ట్రై చేయండి.

అరె.. ఏమైంది.. ట్రై చేశారా లేదా.. ఇంతకీ ఒక్క తేడా అన్న కనిపెట్టారా లేదా? సరే.. అంత కష్టపడకండి కాని.. కింద ఆ తేడాలు ఇస్తున్నాం చూసేయండి. మీరు కనిపెట్టిన తేడాలకు మ్యాచ్ అయ్యాయో లేదో సరిచూసుకోండి. ఓకేనా..

ఈ బ్రెయిన్ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. దీన్ని హాట్‌స్ప్రింగ్ వరల్డ్ అనే కంపెనీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లంతా దాన్ని సాల్వ్ చేయడానికి కుస్తీ పడుతున్నారు.

5048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles