అడవిమంటల్లో గల్లంతైన వారిసంఖ్య 1,000 పైనే

Sat,November 17, 2018 03:47 PM

california wildfire missing number crosses 1000

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దావానలం అడవులతోపాటు వాటి మధ్యన వెలిసిన జనావాసాల్ని భస్మీపటలం చేస్తున్నది. ఆస్తినష్టం, ప్రాణనష్టంతో ఘోరకలి సృష్టిస్తున్నది. అడవుల్ని భీకరంగా దహించివేస్తున్న కార్చిచ్చులో వెయ్యిమందికి పైగా గల్లంతయ్యారని తాజా అధికారిక అంచనాల ద్వారా తెలుస్తున్నది. ఇదిలాఉండగా మరో ఎనిమిది మృతదేహాలు కనుగొన్నట్టు సహాయ కార్యకర్తలు చెప్పారు. దీంతో అధికారికంగా మృతుల సంఖ్య 71కి చేరింది. కాగా గల్లంతైనవారి సంఖ్య గురువారం 630 నుంచి శుక్రవారానికి ఒక్కరోజులోనే 1011కు చేరుకోవడం గమనార్హం. ఫిర్యాదులు, ఎమర్జన్సీ కాల్స్‌ను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చినట్టు అధికారులు చెప్పారు. అయితే గల్లంతైనవారందరూ చనిపోయినట్టు భావించరాదని వారు అంటున్నారు.

పరిస్థితి అంతా గందరగోళంగా ఉన్నదని, ప్రస్తుత అంచనాలు అంతిమం కాదని వారు హెచ్చరిస్తున్నారు. అన్నిరకాల ఆధునిక సాంకేతికతలు అందుబాటులో ఉన్న అమెరికాలో దావానలం ఉగ్రరూపం చూస్తుంటే ప్రకృతి ముందు మనుషుల, ప్రభుత్వాల నిస్సహాయత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.

1690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles