విద్యార్థి ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్.. వీడియో

Fri,May 10, 2019 10:57 AM

Bus Driver Samantha Saves Student From Speeding Car in New York

విద్యార్థి ప్రాణాలను కాపాడిన ఓ బస్సు డ్రైవర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. న్యూయార్క్ చెందిన మహిళా డ్రైవర్ సమంత కాల్.. విద్యార్థి దిగుతున్న సమయంలో బస్సును ఆపింది. అయితే బస్సు మిర్రర్ ద్వారా వెనుక నుంచి వస్తున్న కారును సమంత గ్రహించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బస్సు దిగబోతున్న విద్యార్థిని వెనుకకు లాగింది. కారు మందుకు దూసుకెళ్లింది. కారు ముందుకెళ్లిన తర్వాత విద్యార్థి బస్సు నుంచి దిగిపోయాడు. దీంతో సదరు విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ సంఘటన ఏప్రిల్ నెలలో చోటు చేసుకోగా ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. విద్యార్థిని కాపాడిన బస్సు డ్రైవర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

2137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles