రెస్టారెంట్‌లోకి దూరబోయి రెండురోజులు అందులోనే చిక్కుకున్నాడు..!

Thu,December 13, 2018 03:37 PM

Burglary Suspect Gets Stuck In Restaurant Grease Vent For 2 Days

ఓ వ్యక్తి రెస్టారెంట్‌లో దొంగతనం చేద్దామనుకున్నాడో.. ఏందో కానీ.. రెస్టారెంట్‌కు చెందిన గ్రీజ్ వెంట్‌లో రెండు రోజుల పాటు అలాగే చిక్కుకుపోయాడు. గ్రీజ్ వెంట్ అంటే ఓ ఎగ్జిట్ ఫ్యాన్ లాగా అన్నమాట. రెస్టారెంట్లలో కిచెన్‌లోని గాలి బయటికి వెళ్లేందుకు ఏర్పాటు చేసే రంధ్రం అది. దాంట్లో దూరాడు.. అడ్డంగా బుక్కయ్యాడు. అందులో దూరాక మనోడు అటూ ఇటూ ఎటూ కదలలేకపోయాడు. దీంతో అందులోనే మూలుగుతూ రెండు రోజులు ఉన్నాడు. ఇక తన పని అయిపోయిందనుకున్నాడు. ఖేల్ ఖతం అనుకున్నాడు కానీ.. మనోడికి ఇంకా ఈ భూమ్మీద నూకలున్నాయి. మనోడి మూలుగుడు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి మనోడిని రక్షించారు. మనోడిని అందులో నుంచి బయటికి తీయడానికి పోలీసులకు తల ప్రాణం తొకకొచ్చింది. ఈ ఘటన యూఎస్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కోలో చోటు చేసుకున్నది.

అది ఖాళీగా ఉన్న ఓ చైనీస్ రెస్టారెంట్. దాంట్లో ఏదైనా దోచుకుందామనుకున్నాడో ఏమో కానీ.. దాంట్లో దూరబోయి అడ్డంగా బుక్కయిపోయాడు. అత‌డికి గ్రీజు అంతా అంటుకుంది. అతడిని రక్షించిన అనంతరం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతానికి కోలుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం.. అంటూ అలమెడా కంట్రీ షెరిఫ్ ఆఫీస్ పోలీసులు తెలిపారు. అందులో చిక్కుకుపోయిన ఆ దొంగ ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు అలమెడా పోలీసులు.


View this post on Instagram

At 9:27AM, Engine 23 responded to a reported lockout at 754 Bockman Rd in San Lorenzo. Upon arrival, firefighters heard moaning coming from inside the building. A person stated they were stuck in the duct of the hood and duct system above the stove. The response was upgraded to a rescue with Engine 24, Rescue 24, Truck 12 and Battalion 2. An adult male was extricated from the vent system within 30 minutes of firefighters arriving at the scene. The man stated he had been stuck in the duct system for 2 days. He was transported to a local hospital by Paramedics Plus for further evaluation. The Alameda County Sheriffs Office, Alameda County Health Department, and the Alameda County Building Department also responded. @ktvu2 @kpixtv @nbcbayarea @abc7newsbayarea @kron4tv @telemundo48 #ALCOFire #SanLorenzo

A post shared by Alameda County Fire Department (@alamedacofire) on

5558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles