వైరల్ ఫోటో: ఎరక్కపోయి ఇరుక్కున్న దొంగ..!

Sat,November 4, 2017 12:13 PM

Burglar tries to loot restaurant but stuck in ventilator in England

ఏదైనా దొంగతనం చేసే వాడు దొరికితే దొంగ.. దొరకపోతే దొర అంటుంటారు పెద్దలు. అయితే.. ఓ దొంగ మాత్రం తాను చేసిన తలతిక్క పనికి అడ్డంగా దొరికిపోయాడు. ఎరక్కపోయి ఇరుక్కున్న ఈ దొంగ అటు దొంగతనం చేయలేక.. ఇటు పారిపోలేక నానా అవస్థలు పడ్డాడు.

ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్‌ను దోచుకుందామని ప్రయత్నించిన ఆ దొంగ రెస్టారెంట్ వెంటిలేటర్ ద్వారా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు. కాని అందులో ఇరుక్కుపోయాడు. ఎంత ప్రయత్నించినా ముందుకు, వెనక్కు కదల్లేక దీనస్థితిలో అలాగే దాదాపు 7 గంటలు అక్కడే ఉండిపోయాడు.

ఇక.. రక్షించండి అంటూ పెద్దగా దొంగ అరిచే సరికి గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అతడిని అక్కడి నుంచి బయటికి తీసి కటకటాల వెనక్కి సాగనంపారు. ఇక.. ఆ దొంగ వెంటిలేటర్‌లో ఇరుక్కున్న ఫోటోను అక్కడి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

6144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles