వీడేం దొంగరా బాబు.. వీడియో

Wed,April 11, 2018 04:11 PM

Burglar drops cash register while fleeing from doughnut shop in florida

దొంగంటే ఎలా ఉండాలి. చూస్తేనే హడల్.. గడ్డం, మీసాలు పెంచకున్నా... కబాలి సినిమాలో రజినీకాంత్ చెప్పినట్లుగానైనా ఉండాలి కదా.. ఎలాగోలా డోనట్ షాప్‌లో దొంగతనం చేయడానికి వెళ్లిన ఓ ముసుగు వీరుడు.. క్యాష్ బాక్స్, క్యాష్ రిజిస్టర్, ఓ బ్యాగ్‌ను అందుకొని బయటికి పరిగెత్తబోయాడు. ఇంతలో ఆ డోర్ పక్కన జారి పడిపోయాడు. దీంతో అతడి చేతిలో ఉన్నవన్నీ కింద పడిపోయాయి. సరే.. వాటినైనా తీసుకున్నాడా అంటే అదీ లేదు. ఆత్రం ఆత్రంగా ఆ క్యాష్ బాక్స్, బ్యాగ్‌ను అందుకొని క్యాష్ రిజిస్టర్‌ను అక్కడే వదిలేసి భయంభయంగా షాపు నుంచి ఉడాయించాడు. ఇక.. ఈ ఘటన షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఆ ముసుగు వీరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన యూఎస్‌లోని ఫ్లొరిడాలో చోటు చేసుకున్నది.

5225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles