రోబో చెఫ్.. కాని ఒక్కరోజే వండింది.. ఎందుకంటే?.. వీడియో!

Sat,March 10, 2018 05:36 PM

Burger flipping robot suspended after just one day work in US

ఇది టెక్నాలజీ యుగం. ఈ జనరేషనే వేరు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, స్మార్ట్‌ఫోన్, యూట్యూబ్.. అబ్బో చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీలో మరో అద్భుతమైన ప్రతిసృష్టి రోబో. కృత్రిమ మేధస్సు అనే కాన్సెప్ట్‌తో వచ్చిందే ఈ రోబో. ఆ పని ఈ పని అని కాకుండా రోబోతో అన్ని పనులూ చేయించుకుంటున్నారు మనుషులు. డాక్టర్‌గా, సహాయకారిగా, సలహాదారుగా, ఇంకా అనేక రంగాల్లో రోబోను తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు కాకపోయినా.. ఇంకో 20 నుంచి 30 ఏండ్ల తర్వాత ఈ ప్రపంచం అంతా రోబోలమయమవుతుందని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతలా.. టెక్నాలజీ పాతుకుపోతున్నది మానవ రక్తంలో. ఇక.. ఈ సోదంతా కాసేపు ఆపి.. అసలు విషయంలోకి వెళ్దామా..

అది కాలిఫోర్నియాలోని పాసదేనా. అక్కడే ఓ బర్గర్ రెస్టారెంట్ ఉంది. ప్రతి రోజులా కాకుండా గత సోమవారం అక్కడ బర్గర్లను తయారు చేసింది కుక్కులు, చెఫ్స్ కాదు. ఓ రోబో. అవును. ఓ రోబో టకటకా బర్గర్లను తయారు చేసేసింది. ఆ రోబో పేరు ఫ్లిప్పీ. బర్గర్లను అటూ ఇటూ తిప్పుతూ ఏం చక్క చకచకా వండేయడమే దాని పని. బర్గర్లను ఫ్లిప్ చేయడం కోసమే దాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. కాని.. ఒక్కటంటె ఒక్కరోజే అది బర్గర్లను వండింది. తర్వాత నుంచి వండలేదు. ఎందుకంటే?

రోబో కోసం రాసిన ప్రోగ్రామింగ్‌లో వచ్చిన చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల, దానికి సహాయం చేసే స్టాఫ్ సరిపడినంతా రెస్టారెంట్‌లో లేకపోవడం వల్ల ప్రస్తుతానికి ఫ్లిప్పీని బర్గర్లు తయారు చేయడానికి ఉపయోగించట్లేదట. అయితే.. ఇది కొంతకాలం మాత్రమేనని, కొన్ని రోజుల్లేనే కొత్త అప్‌గ్రేడెడ్ వర్షన్‌తో ఫ్లిప్పీ మళ్లీ బర్గర్లు తయారు చేస్తుందని దాన్ని తయారు చేసిన మిసో రోబోటిక్స్ కంపెనీ వెల్లడించింది.

అంతే కాదు.. మరో 50 ఫ్లిప్పీలను ఈ కంపెనీ తయారు చేసి.. యూఎస్‌లో ఉన్న బర్గర్ ఔట్‌లెట్స్‌లో వాటితో పనిచేయించాలన్నదే తమ లక్ష్యమని మిసో రోబోటిక్స్ తెలిపింది. ఒక రోబో.. రోజుకు కనీసం 2000 బర్గర్లను తయారు చేయగలదని.. దీంతో ఎక్కువగా ఆర్డర్లు వచ్చే రోజున.. వీటి అవసరం ఎక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. రోబోలో ఇన్‌స్టాల్ చేసిన స్పాటులా టూల్ వల్లనే అది బర్గర్లను ఫ్లిప్ చేస్తుందని... ఇంకా సెన్సార్, కెమెరా ద్వారా మనుషులను గమనించగలదని కంపెనీ తెలిపింది.

3289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS