రహస్యంగా ఆడవారి స్కర్టుల ఫొటోలు తీయడంపై నిషేధం

Thu,January 17, 2019 05:47 PM

ఆడవారి స్కర్టులను రహస్యంగా ఫొటోలు తీయడంపై నిషేధం విధిస్తూ బ్రిటిష్ ఎంపీలు చట్టాన్ని తెచ్చారు. దీనికి అప్‌స్కర్టింగ్ నిషేధచట్టం అని పేరుపెట్టారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మహిళల కటిప్రదేశాన్ని రహస్యంగా ఫొటోతీసినా, పంపిణీ చేసినా రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారు. రహస్య ఫొటోల బాధితురాలు గినా మార్టిన్ నిర్వహించిన ప్రచారోద్యమం ఫలితంగా ఈ చట్టం ముందుకు వచ్చింది. మంగళవారం ఎగువసభ హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదంతో చట్టం పార్లమెంటు సంపూర్ణ ఆమోదం పొందింది. ఇక రాణి ఆమోదముద్ర వేయడం తరువాయి. చట్టం ఇలా తుదిఘట్టానికి చేరుకోవడంపై గినా మార్టిన్ హర్షం వ్యక్తం చేశారు. లివర్‌పూల్ నుంచి ఓ మ్యూజిక్ పెస్టివల్‌లో పాల్గొనేందుకు లండన్ వచ్చిన గినా హైడ్‌పార్కులో తిరుగుతుండగా ఓ వ్యక్తి దగ్గరగా వచ్చి రాసుకుంటూ వెళ్లాడు. దూరంగా ఇంకో వ్యక్తి కెమెరా ఎక్కుపెట్టాడు. తర్వాత సంగతేంటని గినా వారిని నిలదీస్తే వారికి చెందిన ఫోన్‌లో ఓ అమ్మాయి నడుముభాగం ఫొటో ఉంది. డ్రెస్సును బట్టి ఆ ఫొటో తనదేనని గినా గ్రహించింది. పోలీసులకు పిలిచి చూపితే తాము ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు. దాంతో సామాజిక మాధ్యమాల్లో ఆమె ఈ దిగజారుడు ప్రవర్తనకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టింది. 18 మాసాల కృషి ఫలించి పార్లమెంటు చట్టం చేసింది. సమాజం, రాజకీయాలు ఓమంచి పనికోసం జతకట్టడంగా ఆమె ఈ పరిణామాన్ని అభివర్ణించారు. ప్రధాని థెరెసా మే ఈ చట్టానికి వ్యక్తిగతంగా మద్దతు తెలిపారు.

4224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles