జైలు నుంచి పారిపోయేందుకు కూతురి వేషం.. వీడియో

Tue,August 6, 2019 11:09 AM

Brazil Gang Leader Tries To Escape Prison By Dressing Up As His Daughter

బ్రెజిల్‌కు చెందిన ఓ ఖైదీ పారిపోయేందుకు తన కూతురిలా వేషం ధరించాడు. కానీ ఆ వేషధారణ బెడిసికొట్టింది. జైలు వద్ద విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఖైదీ మారువేషంలో ఉన్నాడని గుర్తించి అతడిని అడ్డుకున్నారు. డ్రగ్స్ మాఫియా కేసులో గ్యాంగ్ లీడర్ క్లౌవినో ద శిల్వ(43) అనే వ్యక్తి జైలు పాలయ్యాడు. అయితే జైలు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రణాళిక రచించాడు. తనను చూసేందుకు ఖైదీ కూతురితో పాటు కుటుంబ సభ్యులు జైలుకు వచ్చారు. అయితే తన కూతురి ముఖంలా ఉన్న ఓ సిలికాన్ మాస్క్, టీ షర్ట్, ప్యాంట్ తెప్పించుకున్నాడు.

ఇక విజిటింగ్ అవర్స్ ముగిసిన తర్వాత ముఖానికి ఆ మాస్క్ ధరించాడు. పింక్ టీ షర్ట్, ప్యాంట్‌తో పాటు అమ్మాయిలా కనపడేందుకు లోదుస్తులు ధరించి గేట్ వద్దకు వచ్చాడు. పోలీసులకు అనుమానం రావడంతో అతన్ని ఆపి బలవంతంగా ఆ దుస్తులను విప్పించడంతో అసలు స్వరూపం బయటపడింది. అయితే తన కూతురిని జైల్లోనే ఉంచి బయటకు పారిపోవాలని ప్రయత్నించాడు ఖైదీ. ఈ కేసు విచారణలో కూతురితో పాటు మిగతా కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.

2628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles